BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 3:45 pm Posted by : Reporter Srikanth

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన, దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బాలునాయక్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన, దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బాలునాయక్

భీమ్ ఇండియా టుడే న్యూస్ నల్గొండ జిల్లా దేవరకొండ, నవంబర్ 9:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్‌లోని ఆయన అధికారిక నివాసంలో దేవరకొండ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలునాయక్, నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

​ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఘనంగా పుష్పగుచ్ఛం అందజేసి, వారికి జన్మదిన మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరింత కాలం కొనసాగుతూ తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన అమూల్యమైన సేవలను అందించాలని ఎమ్మెల్యే బాలునాయక్ ఆకాంక్షించారు.

​ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విభిన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్లాలని ఈ సందర్భంగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు.