నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు నిర్వహిస్తున్నట్లు
హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్లో అనుమతులు లేకుండానే క్రాకర్స్ షాపుల నిర్వహణ? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం! భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: దీపావళి పండుగను పురస్కరించుకుని హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో, చుట్టుపక్కల నివాస గృహాలు ఉన్న ప్రాంతంలో క్రాకర్స్ షాపులను ఏర్పాటు చేయడం స్థానిక ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా, సరైన అనుమతులు లేకుండానే కొన్ని దుకాణాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు...