BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 5:56 pm Posted by : Reporter Srikanth

మృతుల కుటుంబాలను పరామర్శించిన టిఆర్పి జిల్లా అధ్యక్షుడు

మృతుల కుటుంబాలను పరామర్శించిన టిఆర్పి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్

భీమ్ ఇండియా టుడే న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల పరిధిలోని పర్లపల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ, ప్రస్తుత సర్పంచ్ జోరుగా సదయ్య తల్లి కోరుక లచ్చవ్వ నిన్న మృతి చెందగా, ఈరోజు జరిగిన అంతిమయాత్రలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

అదేవిధంగా మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దానబోయిన రాములు ముదిరాజ్ కుమారుడు దానవేని జేశ్వంత్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, రవి పటేల్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. యువకుడి మృతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతుడి తండ్రి దానబోయిన రాములు ప్రమాద ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఈ విషయాన్ని టిఆర్పి పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

దీనిపై రవి పటేల్ స్పందిస్తూ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, త్వరలోనే తీన్మార్ మల్లన్నతో సమావేశం ఏర్పాటు చేసి, వారు వ్యక్తం చేస్తున్న అనుమానాల నివృత్తికి అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సాధు మల్లన్న ముదిరాజ్, నరేష్ ముదిరాజ్, పుట్ట మొగిలి ముదిరాజ్, స్థానిక టిఆర్పి నాయకులు దానబోయిన నరేందర్, రేణుకుంట్ల వెంకటేష్, రేణుకుంట్ల సతీష్, దుప్పటి చిరంజీవి, మామిడి శ్రీకాంత్, ఇటుకల ప్రకాష్, గునికంటి విష్ణు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.