ముఖ్యమంత్రిపై అభిమానం.. 350 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం!
ఆదోని నుంచి హైదరాబాద్కు పాదయాత్ర.. 9 రోజుల ప్రయాణం అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అభిమాని తాయన్న భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఒక్కసారి కలుసుకోవాలన్న బలమైన ఆకాంక్ష ఓ సామాన్యుడితో అసాధారణ ప్రయాణం చేయించింది. ముఖ్యమంత్రిపై ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన తాయన్న ఏకంగా 350 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నారు. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ సుదీర్ఘ పాదయాత్ర...