BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 8:40 pm Posted by : Reporter Srikanth

నేరడుగొమ్ము మోడల్ స్కూల్‌లో ఘనంగా మాక్ ఎలక్షన్ నిర్వహణ

భీమ్ ఇండియా టుడే న్యూస్ నల్గొండ జిల్లా, నవంబర్ 6:నేరడుగొమ్ము మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో శుక్రవారం మాక్ ఎలక్షన్ (నమూనా ఎన్నికలు) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ ఎన్నికల్లో హెడ్ బాయ్,హెడ్ గర్ల్,హౌస్ కెప్టెన్ల ఎంపిక కోసం ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు,ఎన్నికల విధానం, ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎన్నికల ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నామినేషన్ల దాఖలు,ఎన్నికల ప్రచారం,ఓటింగ్,ఓట్ల లెక్కింపు తదితర ప్రక్రియలను నమూనా పద్ధతిలో నిర్వహించారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఎన్నికల నిర్వహణపై ప్రత్యక్ష అవగాహన కల్పించడంతో పాటు, భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించారు.ఫలితాలలో హెడ్ బాయ్ గా జి.కృష్ణ,హెడ్ గర్ల్ గా కే.సుజాత.హౌస్ కెప్టెన్స్ గా జి.గణేష్,కే.ఇందు,ఎన్. శిరీష,ఎన్.చరణ్ లు విజయం సాధించారు.విజయం సాధించిన వారిని ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందించారు. మాక్ ఎలక్షన్స్ ని సజావుగా పూర్తి చేసిన సిబ్బందికి ప్రిన్సిపాల్ కోటేష్ ధన్యవాదాలు తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కోటేష్,సిబ్బంది,విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.