కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మృతి చాలా బాధాకరం ఎమ్మెల్యే బాలు నాయక్
భీమ్ ఇండియా టుడే న్యూస్ నల్లగొండ జిల్లా నేరడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వంగ శ్రీనయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ మృతుడి స్వగృహానికి చేరుకుని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త మృతి బాధాకరమని,ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ముక్కమల్ల వెంకటయ్య గౌడ్,మండల అధ్యక్షుడు వాంకునావత్ బిక్కు నాయక్,మాజీ అధ్యక్షుడు లోకసాని కృష్ణయ్య,సర్పంచ్ పులికంటి సుధాకర్,మాజీ ఎంపీటీసీ లు గిరి యాదయ్య, గడ్డం వెంకటయ్య యాదవ్, బైరెడ్డి కొండల్ రెడ్డి,ఉపసర్పంచ్ ఎలిజర్ల శ్రీను,దొండేటి మల్లారెడ్డి,గోసుల అనంతగిరి, పల్స శంకరయ్య,కొప్పుల సురేందర్ రెడ్డి,వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,గ్రామస్థులు తదితరులు పాల్గొని మృతుడికి నివాళులర్పించారు.