మాజీ ఎంపీటీసీ బొంకూరి కొమురయ్యకు బీఆర్‌ఎస్ నాయకుల నివాళులు
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ బొంకూరి కొమురయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు ఈరోజు ఆయన స్వగృహానికి వెళ్లి కొమురయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్, మాజీ ఎంపీపీ తంగెడ శాలిని మహేందర్, మాజీ మండల అధ్యక్షులు యేల్తూరి స్వామి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు...