భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి.మండలం హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో సర్వే నంబర్ 439 బాంచరాయ్ భూమి సమస్య కు పరిష్కారం లభించినది. భూమి కోల్పోతున్న రైతులను సమావేశపరిచి మండల ఆఫీసులో రైతులకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా జాయింట్ కలెక్టర్ రవికుమార్ సార్ హాజరై మాట్లాడుతూ ఎటి పరిస్థితుల్లో ప్రభుత్వం భూమిని స్వాధీన పరుచుకుంటుంది. కానీ భూమి కోల్పోయిన నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భూమి రిజిస్ట్రేషన్ ప్రకారం ఎంత రేటు ఉంటే దానికి మూడంతులు ప్రభుత్వం చెల్లిస్తుంది. దండేపల్లి లో రిజిస్ట్రేషన్ ప్రకారం సుమారు 11 లక్షలు ఉంటుంది. దానికి మూడు రేట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ అవకాశాన్ని పేదలు భూమిని కూలిపోయే రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే భూమి ఉండి పహాని లో ఉండి కాస్తిలో ఉన్న రైతులకు. అలాగే పట్టా పాసు బుక్కు ఉండి భూమిని దున్నుకొని వారికి అలాగే దున్నుకున్న వారికి పట్టా లేనివారికి అందరికీ సమ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడం జరిగినది. ఇరు గ్రామాల సర్పంచులు గ్రామ పెద్దలు సామాజిక కార్యకర్తలు ఉండాలని తెలిపినారు. భూ బాధితుల కమిటీ వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరినారు. రైతులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇస్తూ నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం మరియు అర్హతను బట్టి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని. అలాగే గుంటూరు పల్లె నుండి దండేపల్లి వరకు రోడ్డు నిర్మాణం మరియు రైల్వే గేటు తొలగింపు చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది. ఇరు గ్రామాలకు ఎలాంటి కాలుష్యం ఉండదని ఎలాంటి నష్టం జరగదని కేవలం పెట్రోలియం స్టోర్ మాత్రమే కంపెనీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలిపినారు. నేను నా వంతుగా పేద దళిత రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వానికి నివేదిక పంపించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎం వెంకటేష్ ఆర్ ఐ భరత్ చంద్ర జిపిఓ కవితా రాణి దండేపల్లి సర్పంచ్ గొలిపెల్లి.సంపత్ గుంటూరు పల్లె సర్పంచ్ మరియు గ్రామస్తులు సామాజికవేత్త కట్కూరి రాజేందర్ జన్ను జన్ను మహేష్ గడ్డం రాజనర్సు నరెడ్ల శంకర్ కొంగ ప్రవీణ్ దండేపల్లి గ్రామస్తులు సామాజిక కార్యకర్తలు వివిధ పార్టీల నాయకులు హనుమకొండ జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారి. మండల అధికారులు. మండల నాయకులు భూ బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు