ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) ప్రతినిధులు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగుతున్న కె. మురళీధర్ వ్యవసాయ క్షేత్రాన్ని హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం. 3 లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) ప్రతినిధులు ఈరోజు సందర్శించారు. సంస్థకు చెందిన ‘పీజీ డిప్లొమా ఇన్ సస్టైనబుల్ కలెక్టివ్స్ మేనేజ్‌మెంట్’ (2026) కోర్సు విద్యార్థులు మరియు అధ్యాపక బృందం ఈ క్షేత్ర పర్యటనలో భాగంగా పాల్గొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా, రసాయన ఎరువులు మరియు పురుగుమందులు వాడకుండా కేవలం సహజ సిద్ధమైన పద్ధతుల్లో సాగు చేస్తున్న విధానాలను వారు నిశితంగా పరిశీలించారు. రైతు కె. మురళీధర్ తాము తయారు చేసుకుంటున్న జీవామృతం, ఘనజీవామృతం, కషాయాల వాడకం మరియు అంతర పంటల సాగు విధానాలను విద్యార్థులకు వివరంగా వివరించారు. పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటూ, భూసారాన్ని కాపాడుకుంటూ నాణ్యమైన దిగుబడులు ఏ విధంగా సాధించవచ్చో ఈ సందర్భంగా విద్యార్థులు ప్రాక్టికల్‌గా తెలుసుకున్నారు.
సుస్థిర యాజమాన్య పద్ధతులపై (Sustainable Management) అధ్యయనం చేస్తున్న ఈ కోర్సు విద్యార్థులకు, క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా విజయవంతంగా సాగుతుందో అర్థం చేసుకోవడానికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడింది. పర్యావరణ పరిరక్షణతో పాటు మానవాళి ఆరోగ్యానికి ప్రకృతి వ్యవసాయమే సరైన మార్గమని ఈ సందర్భంగా ASCI ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఎంతో ఓపికతో తమకు వ్యవసాయ విశేషాలను వివరించిన రైతు మురళీధర్‌ను వారు ప్రత్యేకంగా అభినందించారు.