అల్పాహార పథకం ప్రారంభం విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

గాంధీనగర్ పాఠశాలల్లో ఘనంగా అల్పాహార పథకం ప్రారంభం విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట – సర్పంచ్ కేతిరి లక్ష్మారెడ్డి భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ జిల్లా    గాంధీనగర్:తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉదయం అల్పాహార పథకాన్ని గాంధీనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలకు ఉదయాన్నే చేరుకున్న విద్యార్థులకు వేడివేడిగా పౌష్టికాహారంతో కూడిన అల్పాహారాన్ని అందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో వరుసగా కూర్చొని అల్పాహారం...