BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 8:36 am Posted by : Reporter Srikanth

వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం..

వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.. గుర్తింపు కోసం పోలీసుల విజ్ఞప్తి

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: సింగాపూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కన గల వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. నవంబర్ 3, 2026న సాయంత్రం 5 గంటల సమయంలో సింగాపూర్ గ్రామ శివారులోని NH-563 జాతీయ రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావిలో ఓ గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.

మృతుడి వయస్సు సుమారు 28 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండవచ్చని, ఎత్తు సుమారు 5 అడుగుల 7 అంగుళాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుడు బ్లూ చెక్స్ కలర్ షర్ట్, డార్క్ బ్లూ కలర్ జీన్స్ ధరించి ఉండగా, మెడలో తాయత్తు ఉన్నట్లు వెల్లడించారు.

అయితే మృతుడి వివరాలు, ఆచూకీ ఇంకా తెలియరాలేదని, మృతుడిని గుర్తించేందుకు ప్రజలు సహకరించాలని హుజురాబాద్ టౌన్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. మృతుడి గురించి ఏవైనా వివరాలు తెలిసిన వారు హుజురాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ టి. కరుణాకర్ (8712670773), ఎస్‌ఐ వి. శ్రీనివాసరావు (9908833022)ను సంప్రదించాలని కోరారు.

మృతుడి గుర్తింపు కోసం ప్రజలు తమకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకు అందించి దర్యాప్తునకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.