ఎల్కతుర్తి మండలంలో ఘనంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలంలో గౌరవ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సుకినె సంతాజీ గారు, LSCS చైర్మన్ శ్రీ ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి గారి చేతుల మీదుగా వివిధ గ్రామాల్లో IKP (SERP), LSCS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, AMC, LSCS డైరెక్టర్లు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ, వ్యవసాయ రంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని నాయకులు పేర్కొన్నారు.