మత్తు పదార్థాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌హెచ్‌ఓ నరసింహారావు

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం హన్మకొండ విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ పనితీరు, పోలీసుల విధులు, చట్టాలు, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు ఎల్కతుర్తి పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం శాంతినగర్‌లోని సెంటెన్స్ స్కూల్ విద్యార్థులకు బుధవారం ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) నరసింహారావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులను క్షుణ్ణంగా పరిశీలించి, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం కేసు...