బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం
భీమ్ ఇండియా టుడే న్యూస్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్ డివిజన్ రాజా లింగం కాలనీ ఫేజ్-2లో రూ.90 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను, చెంగిచెర్ల డివిజన్ పరిధిలోని శివ దుర్గ కాలనీలో రూ.60 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా తోటకూర అజయ్ యాదవ్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలను గుర్తించి కాలనీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ డివిజన్ అధ్యక్షులు పొగుల నర్సింహా రెడ్డి, బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, చెంగిచెర్ల డివిజన్ అధ్యక్షులు పొగుల దిలీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుర్రి మహేష్, అసర్ల బీరప్ప ,వైస్ ప్రెసిడెంట్ రసాల కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, కొత్త చందర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యులు బ్రహ్మన్న గౌడ్, కాంగ్రెస్ నాయకుల చేసిన కుర్రి శివ శంకర్, తదితరులు పాల్గొన్నారు.