30వ వార్డులో సమస్యల పరిష్కారానికి మున్సిపల్ చైర్పర్సన్ ప్రత్యేక డ్రైవ్
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: పట్టణంలోని 30వ వార్డులో నెలకొన్న ప్రజా సమస్యలను గుర్తించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యం, హరితహారం, ఇతర మున్సిపల్ సేవలకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. వార్డులో పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా...