BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 10:22 pm Posted by : Reporter Srikanth

30వ వార్డులో సమస్యల పరిష్కారానికి మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రత్యేక డ్రైవ్

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: పట్టణంలోని 30వ వార్డులో నెలకొన్న ప్రజా సమస్యలను గుర్తించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వార్డులో పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యం, హరితహారం, ఇతర మున్సిపల్ సేవలకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. వార్డులో పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషన్, మేనేజర్ భూపాల్ రెడ్డి, ఏఈ నరేష్, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీకాంత్, ఆర్‌ఐ శ్రీకాంత్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ వినయ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిరణ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ వినయ్, మున్సిపల్ సిబ్బంది వేణు, వార్డు ఆఫీసర్ అశోక్, జవాన్లు అనిల్, రాజు, సిబ్బంది శ్రీధర్, వీరస్వామి, బిక్షపతి, హరితహారం సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.