BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 10:13 pm Posted by : Reporter Srikanth

గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ గా అవకాశం కల్పంచాలి.

గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ గా అవకాశం కల్పంచాలి.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేసిన…

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుస్నాబాద్ సామాజిక కార్యకర్త,పిడిశెట్టి రాజు సిద్దిపేట జిల్లా : నవంబర్ 02,హుస్నాబాద్ నియోజకవర్గం  కోహెడ మండలం

గత రెండు దశాబ్దాలుగా బీసీ అట్టడుగు వర్గాల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సాధికారత కోసం నిరంతరంగా పోరాడుతూ, తన జీవితాన్ని పేద ప్రజల అభ్యున్నతికి అంకితం చేసిన…

చాలకి ఐలమ్మ,ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ వారసత్వాన్ని కొనసాగిస్తూ,మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన సామాజిక న్యాయ మార్గంలో అంకితభావంతో ముందుకు సాగుతున్న బీసీ ఉద్యమ నాయకుడు పిడిశెట్టి రాజు అను నేను రెండు దశాబ్దాల సామాజిక సేవను, బీసీ సమాజానికి చేసిన విశేష కృషిని గుర్తించి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోహెడ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి కి తెలంగాణ పోరాట వీరులు, మేధావులు, ఉద్యమకారులు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు.ఇది ఒక వ్యక్తికి పదవి కల్పించాలనే విజ్ఞప్తి మాత్రమే కాదు… రెండు దశాబ్దాలుగా బీసీ సమాజ హక్కుల కోసం సాగుతున్న నిరంతర పోరాటానికి,కుమ్మర శాలివాహన నేతృత్వంలోని అట్టడుగు వర్గాల సామాజిక సేవకు తగిన గుర్తింపు కల్పించాలనే ప్రజల ఆకాంక్ష అని రాజు పేర్కొన్నారు.