BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:23 pm Posted by : Reporter Srikanth

ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి

భీమ్ ఇండియా టుడే న్యూస్ పరకాల హన్మకొండ జిల్లా    పట్టభద్రులకు కాంగ్రెస్ నాయకుల పిలుపు జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్ త్వరలో జరగనున్న నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొచ్చు రాజు పిలుపునిచ్చారు.

గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు సైతం నవంబర్ 6వ తేదీలోపు తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్ కోరారు. గతంలో ఓటరుగా నమోదు ఉన్నప్పటికీ ఈసారి నూతనంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని, లేకపోతే ఓటరు జాబితాలో పేరు ఉండకపోవచ్చని తెలిపారు.

2023 నవంబర్ 1 నాటికి డిగ్రీ, డిప్లొమా లేదా ఇతర అర్హత కలిగిన పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ పార్టీ 2వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు బొచ్చు అనిల్ కోరారు.

ఈ ఓటు నమోదు కార్యక్రమంలో బొచ్చు భరత్ చంద్ర, బొచ్చు తేజ తదితరులు పాల్గొన్నారు.