BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 4:27 pm Posted by : Reporter Srikanth

ఢిల్లీలో AICC పిలుపు మేరకు నిరసన కార్యక్రమం.

ఓటు చోరీకి నిరసనగా ఢిల్లీలో AICC పిలుపు మేరకు నిరసన కార్యక్రమం.

పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,ఎంపీ బలరాం నాయక్ 

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ      ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత అనే ప్రధాన డిమాండ్లతో AICC (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ) పిలుపు మేరకు నేడు ఢిల్లీలో నిర్వహించిన ఓటు చోరీ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,ఎంపి బలరాం నాయక్ గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి నర్సంపేట నుండి వచ్చిన 150 మంది కాంగ్రెస్ నాయకుల బృందం తో కలిసి నిరసన కార్యక్రమం లో పాల్గొని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం చేతుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలుబొమ్మ గా మారిందని అన్నారు.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ నిరసన కార్యక్రమంలో “ఓటు చోర్ – మోదీ హటావో, భారత్ బచావో” అనే నినాదంతో కూడిన బ్యానర్‌ను ప్రదర్శిస్తూ నాయకులు తమ ఆందోళనను తెలియజేశారు.