ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొన్న వొడితల ప్రణవ్

ఓటు హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీలో ఇండియా కూటమి చేపట్టిన నిరసన కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్న ప్రణవ్ బాబు. భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: దేశంలో బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆరోపించారు. ఆదివారం న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో నిర్వహించిన 'ఓట్ బచావో – దేశ్ బచావో' భారీ నిరసన కార్యక్రమంలో...