ఓటు హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీలో ఇండియా కూటమి చేపట్టిన నిరసన కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్న ప్రణవ్ బాబు.
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: దేశంలో బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆరోపించారు.
ఆదివారం న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో నిర్వహించిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ భారీ నిరసన కార్యక్రమంలో వొడితల ప్రణవ్ హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఓటరు హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నాయకులు నినదించారు. సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను వ్యతిరేకిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్లతో రాంలీలా మైదానం నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఇండియా కూటమి నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.