BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 4:43 pm Posted by : Reporter Srikanth

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న వైద్య అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే హెచ్చరించారు.

శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రతి వార్డును సందర్శిస్తూ రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు సేకరించారు. ఆసుపత్రిలో రోగులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, వైద్య సేవలు, ఇతర సౌకర్యాల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వైద్యులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు, అసిస్టెంట్ కలెక్టర్ హరి ప్రసాద్, హుజూరాబాద్ ఆర్డీవో జల కుమారి, డీసీహెచ్ఎస్ డాక్టర్ కృష్ణ ప్రసాద్, డాక్టర్ హఖీయోద్దీన్ ఖాన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రభుదాస్, తహసీల్దార్ జక్కని నరేందర్, మున్సిపల్ కమిషనర్ బి. కిషన్, కౌన్సిలర్ కోయల్‌కార్ భారతి తదితరులు పాల్గొన్నారు.