టీపీటీఎఫ్ (TPTF) ఏల్కతుర్తి మండల ఎన్నికలు – నూతన కార్యవర్గం ఎన్నిక
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) ఏల్కతుర్తి మండల శాఖ ఎన్నికలు ఈరోజు అనగా 30-10-2026 నాడు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి.
ఈ ఎన్నికలకు *ఎన్నికల అధికారిగా J. లక్ష్మయ్య మరియు పరిశీలకులుగా E. కుమారస్వామి వ్యవహరించారు.
ఈ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం వివరాలు:
అధ్యక్షులుగా: B. సారయ్య ప్రధాన కార్యదర్శిగా:P. సదయ్య
ఎన్నికైన నూతన అధ్యక్షులు B. సారయ్య మాట్లాడుతూ… ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని, సంఘాన్ని మండలంలో మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి P. సదయ్య ఉపాధ్యాయుల సంక్షేమమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, TPTF సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.