BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 7:29 pm Posted by : Reporter Srikanth

విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్

విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: పట్టణంలోని KC క్యాంపులో ఉన్న MJP బాలికల పాఠశాలను హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినులతో ఆమె నేరుగా మాట్లాడి వారి బాగోగులు, విద్యా సదుపాయాలు, భోజన వసతులు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించిన ఆమె, పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు విద్యార్థులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థినుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సునీత బాబు, తాళ్లపెల్లి రమేష్, వెన్నెల నవీన్, మొగిలి, మహమ్మద్ ఖలీద్, పుణ్య బాబు, భాస్కర్, స్వరూప తిరుపతి, కో-ఆప్షన్ సభ్యులు జమదగ్ని, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.