భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ దమ్మక్కపేటలో వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు
హుజురాబాద్ పట్టణంలోని దమ్మక్కపేట 9వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ సమ్మయ్యను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ వార్డు ప్రజలకు ప్రభుత్వ, మున్సిపల్ సేవలు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కౌన్సిలర్లు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సునీత బాబు, తాళ్లపల్లి రమేష్, వెన్నెల నవీన్, మొగిలి, మహమ్మద్ ఖలీద్, పుణ్య బాబు, భాస్కర్, స్వరూప తిరుపతి, కో-ఆప్షన్ సభ్యులు జమదగ్ని, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.