BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 7:06 pm Posted by : Reporter Srikanth

పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక స్మార్ట్ రేషన్ కార్డులు.

భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 8,9,10,11 వార్డులకు సంబంధించిన ప్రజలకు మోత్కులగూడెం లోని రేషన్ షాప్ వద్ద ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు మొలుగూరి సదయ్య, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు – బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ; ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకలని అన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 8, 9, 10, 11 వార్డులకు చెందిన లబ్ధిదారులకు మోత్కులగూడెంలోని రేషన్ షాపు వద్ద కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్ బాబు గారి ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ప్రజలను ఉద్దేశించి, శాసనసభ ఎన్నికల సమయంలో హస్తం గుర్తుకు ఓటు వేస్తే పేదల బతుకుల్లో మార్పు తీసుకొస్తామని రాహుల్ గాంధీ నేతృత్వంలో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రజా ప్రభుత్వం పేదల ఆకలి హక్కును గౌరవిస్తోందని కొనియాడారు. గత పదేళ్ల పాలనలో రేషన్ కార్డుల విషయంలో పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వివాహమైన కొత్త జంటలు, పుట్టిన చిన్నారుల పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చుకోవడానికి కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేసిన పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అన్నారు. పేదలకు కొత్త రేషన్ కార్డులు అందించడంలో గత పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆరోపించారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో పాలనను చూపిస్తోందని తెలిపారు. నేడు పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు కేవలం రేషన్ సరుకులు పొందేందుకు మాత్రమే కాకుండా, పేదల ఆత్మగౌరవానికి గుర్తింపుగా నిలుస్తాయని అన్నారు. తొమ్మిది రకాల భద్రతా లక్షణాలతో, అవినీతికి, దళారుల దోపిడీకి తావులేకుండా ఆధునిక డిజిటల్ సాంకేతికతతో ఈ కార్డులను ప్రభుత్వం అందిస్తోందని వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో వాటిని వినియోగించుకోలేక కొందరు ఇతర అవసరాలకు మళ్లించిన పరిస్థితులు ఉండేవని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన సన్నబియ్యం తినాలనే లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం సరఫరానే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలుస్తున్న ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు, మద్దతు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 8, 9, 10, 11 వార్డులకు చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పొనగంటి.విష్ణు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొనగంటి రవీందర్, జమ్మికుంట మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట స్వప్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు శీలం అశోక్, రాజ కొమురయ్య, యేబుషి ఓదెలు, ఉడుగుల మల్లయ్య, కట్ట దేవేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.