పట్టుపురుగుల పెంపకం కేంద్రాన్ని సందర్శించిన ఆల్ఫోర్స్ విద్యార్థులు

క్షేత్ర పర్యటనతో వ్యవసాయం, పట్టు పరిశ్రమపై అవగాహన భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష అనుభవాన్ని అందించడంతో పాటు, సామాజిక, ప్రకృతి, వ్యవసాయ రంగాలపై అవగాహన కల్పించేందుకు విజ్ఞాన పర్యటనలు ఎంతగానో దోహదపడతాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ జీనియస్ పాఠశాల విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్‌లో భాగంగా తుమ్మనపల్లి గ్రామంలోని పట్టుపురుగుల పెంపకం కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు...