దామర గ్రామంలో బీజేపీలో చేరిన కాంగ్రెస్ BRS నాయకులు
మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరికలు
బీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం దామేరా గ్రామానికి చెందిన *కందికొండ కోటిలింగం,పాండ్రాల సదానందం* భారతీయ జనతా పార్టీలో చేరారు. *మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్* ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు అల్లికుమార్, చిదురల వెంకటేష్, ఉపాధ్యక్షులు అంబ్బీర్ శ్రీనివాస్, దామర శక్తి కేంద్ర ఇన్‌చార్జి ఠాకూర్ శాంసింగ్, సాతూరి ప్రభాకర్, చల్ల రవీందర్ రెడ్డి, మంతుర్తి సమ్మయ్య మాజీ సింగిల్ విండో డైరెక్టర్.పండ్రాల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.