ఇంటి వద్దకే మీ-సేవ’కు విశేష స్పందన
ప్రారంభించిన నెలరోజుల్లోనే 3,885 కాల్స్ భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, పారదర్శకమైన పాలనను అందించడం లక్ష్యంగా చేపట్టిన ‘మీ ఇంటి వద్దకే మీ-సేవలు’ అనే కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని మీ-సేవ కమిషనర్ రవికిరణ్ తెలిపారు. ప్రారంభించిన నెల రోజుల్లోనే అనూహ్య స్పందన లభించిందని, 3,885 కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ డోర్ స్టెప్ సేవలు ‘క్యూర్’ పరిధిలో అందుబాటులో ఉన్నాయని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు....