భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ సివిల్ ఆసుపత్రి ముందు మురికి కాలువలు, చెత్తాచెదారం. రోగులకు తప్పని ఇబ్బందులు..ఆసుపత్రికి వచ్చే రోగులకు పరిశుభ్రమైన వాతావరణం ఎక్కడ. పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొనడం ఆందోళన.. దుర్వాసనతో పాటు, చెత్త పేరుకు పోవడం వల్ల వ్యాధులు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మురికి కాలువలను శుభ్రం చేయడం తో పాటు, చెత్తాచెదారాన్ని తొలగించాలి.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సివిల్ ఆసుపత్రి ముందు మురికి కాలువలు, పేరుకుపోయిన చెత్తాచెదారంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సి ఉండగా, పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. మురికి కాలువల నుంచి వెలువడుతున్న దుర్వాసన తో పాటు, చెత్త పేరుకు పోవడం వల్ల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మురికి కాలు వలను శుభ్రం చేయడంతో పాటు, చెత్తాచెదారాన్ని తొలగించి ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని రోగులు, స్థానికులు కోరుతున్నారు.