సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలో1
భీమ్ ఇండియా టుడే స్పెషల్ స్టోరీ హైదరాబాద్ శ్రీకాంత్ దక్షిణ భారతదేశాన్ని అత్యంత సురక్షితమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు తెలంగాణ అనుసరిస్తున్న సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థను పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల (SRPCC) సమన్వయ కమిటీ సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు....