BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 5:54 pm Posted by : Reporter Srikanth

మహాత్మా జ్యోతిబా పూలే.సావిత్రిబా పూలే విగ్రహాల నిర్మాణానికి వినతి

మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే విగ్రహాల నిర్మాణానికి వినతి

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్: కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే విగ్రహాలను నిర్మించాలని కోరుతూ పూలే కమిటీ తరఫున వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా పూలే కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంలో విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం విశేష కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే ఆశయాలను భావితరాలకు తెలియజేసేందుకు వారి విగ్రహాలను నిర్మించాలని కోరారు. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పూలే కమిటీ అధ్యక్షులు చల్లూరి రఘు చారి, గౌరవ అధ్యక్షులు తాళ్లపల్లి రమేష్, వేల్పుల రత్నం, మాజీ అధ్యక్షులు ఉప్పు శ్రీనివాస్, బండారి సదానందం, ఉపాధ్యక్షులు మంద బిక్షపతి, మార్త రవీందర్, మామునూరి ప్రవీణ్‌తో పాటు పూలే కమిటీ సభ్యులు, బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.