BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 6:16 pm Posted by : Reporter Srikanth

సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి

రైతుల సమస్యపై తక్షణ స్పందన.. పంట పొలాలకు సాగునీరు అందించిన మార్కెట్ చైర్‌పర్సన్ స్వప్న సదానందం

భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంట వావిలాల గ్రామ రైతుల విజ్ఞప్తికి స్పందన.. పెద్ద చెరువు తూము తెరిపించి పంటలకు నీటి విడుదల

వావిలాల: పంట చివరి దశలో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో ఆందోళనకు గురైన వావిలాల గ్రామ రైతులు మార్కెట్ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం ను సంప్రదించి తమ సమస్యను వివరించారు. రైతుల విజ్ఞప్తిపై ఆమె తక్షణమే స్పందించి, నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి గ్రామంలోని పెద్ద చెరువు తూమును తెరిపించి పంట పొలాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు.

పంట చేతికొచ్చే చివరి దశలో నీటి కొరత కారణంగా పంటలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో చైర్‌పర్సన్ స్వప్న సదానందం చొరవ తీసుకుని అధికారులతో సమన్వయం చేయడంతో పంట పొలాలకు నీరు అందింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

తమ సమస్యను తెలియజేసిన వెంటనే స్పందించి, పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించేందుకు కృషి చేసిన మార్కెట్ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం కు వావిలాల గ్రామ రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.