BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 8:53 pm Posted by : Reporter Srikanth

రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు శుభవార్త

రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు శుభవార్త.. నిధులు మంజూరు!

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  రెండో విడత దళిత బంధు పథకం కింద పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉండగా, నా సుదీర్ఘ పోరాటం ఫలితంగా నేడు విడుదలకు మంజూరు లభించింది.

కాబట్టి రెండో విడత దళిత బంధు పథకం కింద ఎవరికైతే ఇంకా డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయో, వారందరూ మీ మండల MRO,హుజురాబాద్ ఆర్డీఓ గారిని కలిసి సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తద్వారా మీ పెండింగ్ సమస్య పరిష్కారమై, మీకు రావాల్సిన లబ్ధి అందేలా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఎవరికైనా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి నన్ను సంప్రదించవచ్చు. మీ సమస్యల పరిష్కారం కోసం నేను అందుబాటులో ఉంటాను.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.