విదేశాల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతికి విశ్వవ్యాప్త గుర్తింపు విదేశాల్లో తెలుగు మహిళల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి
బీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు విదేశాల్లోనూ ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మన తెలుగు మహిళలు శిల్ప, సంధ్య, హరిప్రియ, స్రవంతి మరియు లలిత ఆంధ్ర మరియు తెలంగాణ ఆడపడుచులు,
ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి, ఆటపాటలతో వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు.
తెలంగాణ మట్టివాసనను, పల్లె సంస్కృతిని, ప్రకృతి ఆరాధన గొప్పతనాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగ విదేశీ గడ్డపై కూడా తెలుగు ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. సంప్రదాయ బతుకమ్మ పాటలు, కోలాటాలు, మహిళల సామూహిక నృత్యాలతో వేడుకల ప్రాంగణాలు సందడిగా మారుతున్నాయి.
విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తమ సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోకుండా భావితరాలకు వాటి విశిష్టతను పరిచయం చేయడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. చిన్నారులకు బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించి, తెలంగాణ వారసత్వాన్ని కొనసాగించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బతుకమ్మ అంటే పూల పండుగ మాత్రమే కాదు… తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళల ఐక్యతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీక. తెలంగాణ నుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ పూల పండుగ తెలుగు ప్రజల గుండెల్లో సంప్రదాయాల సౌరభాన్ని నింపుతూ ఘనంగా కొనసాగుతోంది.