BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 11:06 am Posted by : Reporter Srikanth

విజయదశమి వేడుకల ఘన విజయం – హృదయపూర్వక ధన్యవాదాలు 

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్ పట్టణంలో విజయదశమి వేడుకలను ఘనంగా, విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ వేడుకల విజయానికి తమ వంతు కృషి చేసిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, విద్యుత్ శాఖ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రామలీలా కమిటీ సభ్యులు, ప్రెస్ అండ్ మీడియా మిత్రులు, ఆర్కెస్ట్రా బృందం మరియు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న హుజూరాబాద్ పట్టణ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.

ప్రతి ఒక్కరి సహకారం, సమన్వయం, అంకితభావం వల్లే ఈ వేడుకలు ఇంత ఘనంగా విజయవంతమయ్యాయి.

ఒక్కరి కృషి ఒక అడుగు… అందరి సమిష్టి కృషి ఒక గొప్ప విజయం!

మన హుజూరాబాద్ పట్టణంలో ఐక్యత, సోదరభావం, సంస్కృతి, సంప్రదాయాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మీ అందరి సహకారం, ఆదరణ ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ, మరోసారి ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు విజయదశమి శుభాకాంక్షలు.