భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ పట్టణంలో హై స్కూల్ గ్రౌండ్ లో విజయదశమి వేడుకలు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ రొంటాల సుహాసిని మనోజ్ రావు గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శమీ పూజ రాంలీల కార్యక్రమం జరిగాయి.
చెడుపై మంచి సాధించిన విజయం… అధర్మంపై ధర్మం సాధించిన విజయం… అదే విజయదశమి!
దసరా అంటే కేవలం ఒక పండుగ కాదు. చెడుపై మంచి సాధించిన విజయం, అధర్మంపై ధర్మం సాధించిన విజయం, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయం.
రావణుడిపై శ్రీరాముడి విజయం, మహిషాసురుడిపై అమ్మవారి విజయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. అధర్మం ఎంత బలంగా కనిపించినా, చివరికి గెలిచేది ధర్మమే! ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కిషన్ ACP మాధవి గారు,CI కరుణాకర్ , వైస్ చైర్మన్ అంజలి,కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యులు, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, రామ్ లీలా కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ కార్మికులు మరియు హుజరాబాద్ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు