కాలినడకన జమ్మి చెట్టు వద్దకు

భీమ్ ఇండియా టుడే న్యూస్  హైదరాబాద్ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో గ్రామస్థులతో కలిసి విజయదశమి వేడుకల్లో పాల్గొని పండుగ సంబరాలను మరింత ప్రత్యేకంగా మార్చారు. సొంత ఊరి ప్రజల మధ్య ఆత్మీయంగా గడుపుతూ, పెద్దలు, చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ, గ్రామస్థులతో సరదాగా ముచ్చటిస్తూ పండుగ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు.  ముఖ్యమంత్రి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. అడుగడుగునా ఆత్మీయ స్వాగతాలు, అభిమాన పలకరింపులతో కొండారెడ్డిపల్లి పల్లె పండుగ శోభను సంతరించుకుంది. సాయంత్రం...