భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ఉప్పల్‌లో ఘనంగా రావణ దహనం.. పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు*
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్‌లో రావణ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు దసరా పండుగ విశిష్టతను, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ దహనానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దసరా వేడుకల్లో భాగస్వాములయ్యారు.