అశోకుని ధమ్మ విజయమే భారత రాజ్యాంగం
భీమ్ ఇండియా టుడే స్పెషల్ స్టోరీ హైదరాబాద్ శ్రీకాంత్ ప్రజాస్వామ్యానికి, సామాజిక సమానత్వానికి అశోకుని ధమ్మ మార్గం స్ఫూర్తిదాయకం భారతదేశ చరిత్రలో చక్రవర్తి అశోకుడు అనుసరించిన ధమ్మ మార్గం, భారత రాజ్యాంగం ప్రతిపాదించిన ప్రజాస్వామ్య విలువలు సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అహింస, శాంతి, సహనం, సమానత్వం, ప్రజా సంక్షేమం వంటి విలువలకు అశోకుడు ప్రాధాన్యతనివ్వగా, భారత రాజ్యాంగం కూడా ఇదే స్ఫూర్తితో పౌరుల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి పెద్దపీట వేసింది. కళింగ యుద్ధం అనంతరం అశోకుడు హింసామార్గాన్ని విడిచిపెట్టి ధమ్మ...