భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంట పట్టణంలో ఘనంగా తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం
శ్రీమతి పాడి శాలిని రెడ్డి* గారి జన్మదినం సందర్భంగా పేదలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి సేవా కార్యక్రమం
జమ్మికుంట పట్టణంలో ఉపాధి కోసం తోపుడు బండ్లు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలుస్తూ, వారి జీవనోపాధికి తోడ్పడాలనే సదుద్దేశంతో గౌరవ హుజూరాబాద్ ఎమ్మెల్యే శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి సతీమణి శ్రీమతి పాడి శాలిని రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా నిరుపేదలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎమ్మెల్యే గారు చేసిన కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల ఎమ్మెల్యే శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారికి, శ్రీమతి పాడి శాలిని రెడ్డి గారికి జమ్మికుంట పట్టణ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ గారు, వైస్ చైర్మన్ జావిద్ అలీ గారు, కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు గారు, కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిళి రమేష్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోల్నేని సత్యనారాయణ రావు గారు, ఇతర మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీల సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.