BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 20 October 2026, 11:58 am Posted by : Reporter Srikanth

విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పర్వదినాన

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ  విజయదశమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పర్వదినాన ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరుకున్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్ట స్థానమున్న దసరా పండుగ… ధైర్యం, ధర్మం, సత్యం, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను మనకు గుర్తుచేస్తుంది. ప్రేమ, కరుణ, సోదరభావం, మానవత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి సంకేతంగా ప్రతి పల్లెలో పండుగ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి.

తెలంగాణ పల్లెపల్లెల్లో దసరా వేడుకలకు మరింత ప్రత్యేకతను చేకూర్చే జమ్మిపూజ, జమ్మి ఆకులను (బంగారం) ఆత్మీయులకు అందించుకోవడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం మన సంస్కృతిలోని గొప్పదనానికి ప్రతీకలు.

ప్రకృతిని ప్రేమించడం, పెద్దలను గౌరవించడం, బంధాలను బలోపేతం చేసుకోవడం, పరస్పర ప్రేమాభిమానాలను పంచుకోవడం వంటి విలువలను ఈ సంప్రదాయాలు చాటిచెబుతాయి” అని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.

ఈ విజయదశమి రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, సకల విజయాలు కలగాలని ఆకాంక్షించారు.