BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 20 October 2026, 11:06 am Posted by : Reporter Srikanth

పాడి శాలిని రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సతీమణి పాడి శాలిని రెడ్డి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా హుజూరాబాద్ రిపోర్టర్ ప్రియదర్శిని కుమారుడు దంపతులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పాడి శాలిని రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం తాపత్రయపడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి, ఆయన కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని ఆకాంక్షించారు.

అనంతరం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగతో పాటు విజయదశమి (దసరా) పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ పండుగలు ప్రతి ఇంటా సంతోషాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని కోరుకున్నారు.