BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 10:35 pm Posted by : Reporter Srikanth

జన్మదినం సందర్భంగా చిరు వ్యాపారికి నాలుగు చక్రాల బండి అందజేత

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

జన్మదినం సందర్భంగా చిరు వ్యాపారికి నాలుగు చక్రాల బండి అందజేత

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంతో ముడిపెట్టి, చిరు వ్యాపారికి జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో నాలుగు చక్రాల బండిని కానుకగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, గంద శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, తిరుమల్ రెడ్డి, కొండల్ రెడ్డి, మారపల్లి సుశీల, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వన్నెల శివాజీ తదితరులు పాల్గొన్నారు.

శాలిని జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.