BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 3:40 pm Posted by : Reporter Srikanth

సూసైడ్ నోట్‌లో పలువురి పేర్లు ఉన్నట్లు ఆరోపణలు

దసరా మామూళ్ల వేధింపులా? డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్యతో కలకలం

భద్రాచలం ప్రైవేట్ లాడ్జిలో విషాదం.. సూసైడ్ నోట్‌లో పలువురి పేర్లు ఉన్నట్లు ఆరోపణలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దసరా మామూళ్ల పేరుతో వేధింపులకు గురయ్యాననే ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. భద్రాచలంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

సూసైడ్ నోట్‌లో సంచలన ఆరోపణలు

తన ఆత్మహత్యకు పలువురు కారణమంటూ లక్ష్మీనారాయణ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ రజితతో పాటు పలువురు మీడియా ప్రతినిధుల పేర్లను ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. దసరా మామూళ్ల పేరుతో తనను భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు సూసైడ్ నోట్‌లో ఆరోపించినట్లు తెలుస్తోంది.

కోటి రూపాయలు డిమాండ్ చేశారా?

దసరా మామూళ్ల పేరుతో తనను కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు లక్ష్మీనారాయణ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించినట్లు అందులో వివరించినట్లు సమాచారం.

విచారణతోనే వెలుగులోకి రానున్న వాస్తవాలు

ఈ ఘటనతో జిల్లాలో తీవ్ర చర్చ మొదలైంది. సూసైడ్ నోట్‌లో పేర్కొన్న ఆరోపణలు నిజమా? లక్ష్మీనారాయణపై ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? ఈ ఘటన వెనుక అసలు కారణాలేంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే, సూసైడ్ నోట్‌లో పేర్లు ఉన్నట్లు చెబుతున్న వ్యక్తులపై వచ్చిన ఆరోపణలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు, సూసైడ్ నోట్ పరిశీలన, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగానే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని స్థానికంగా చర్చ జరుగుతోంది.