తల్లి జ్ఞాపకార్థం.. భక్తుల దాహార్తి తీర్చేందుకు ఏడేళ్లుగా సేవ
మానవత్వానికి మించిన సేవ మరొకటి లేదు.. నిమ్మటూరి సాయికృష్ణ సేవలను అభినందించిన మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్, అక్టోబర్ 18: కన్నతల్లి జ్ఞాపకార్థం హుజురాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ నిమ్మటూరి సాయికృష్ణ గత ఏడేళ్లుగా బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, భక్తులకు ఉచితంగా తాగునీరు అందిస్తున్నారు. తల్లి రాజేశ్వరి స్మృతిని సేవా కార్యక్రమంగా కొనసాగిస్తూ ఆయన మానవత్వాన్ని చాటుకుంటున్నారు. హుజురాబాద్ పట్టణంలోని మారుతీనగర్ బతుకమ్మ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ వేడుకలకు పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు హాజరవుతారు....