BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 5:41 pm Posted by : Reporter Srikanth

పండుగ కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగినది

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్, తేదీ: 18-10-2026 రోజున తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ పండుగ అయిన సద్దుల బతుకమ్మ పండుగ సందర్బముగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజల సౌకర్యార్థము పురపాలక సంఘము పరిధిలోని ఈ దిగువ తెలిపిన ప్రాంతాలలో హుజురాబాద్ పురపాలక సంఘ గౌరవ పాలకవర్గము వారు సద్దుల బతుకమ్మ పండుగ కొరకు (ఆడుకొనుటకు) ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగినది.

కాబట్టి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమమును విజయవంతము చేయుటకు గాను కోరనైనది.

1. చిలుకవాగు చెక్ డ్యాం ప్రక్కన బతుకమ్మ సౌల్లు

2. బోర్నపల్లి చెరువు వద్ద

3. దమ్మక్కపేట ప్రాథమిక పాఠశాల వద్ద

4. దమ్మక్కపేట ఎల్లమ్మ గుడి ముందు

5. దమ్మక్కపేట పర్కాల “ x “ రోడ్డు వద్ద 

6. కరీంనగర్ ప్రధాన రహదారి SRSP కెనాల్ ప్రక్కన లవ్ హుజురాబాద్ పార్కు వద్ద

7. కొత్తపల్లి నాగమయ్య గుడి వద్ద

8. ఇప్పల్ నర్సింగాపూర్ కెనాల్ ప్రక్కన పోచమ్మ గుడి వద్ద

9. గణేష్ నగర్ నందు

కావున సమస్త హుజురాబాద్ పట్టణ పాత్రికేయ మిత్రులందరూ ఇట్టి విషయమును పట్టణ ప్రజలకు తెలియజేయు నిమిత్తము మీమీ దినపత్రిక నందు ప్రచురణ చేయుటకు గాను తమరిని కోరనైనది.