ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా

సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని మనోజ్ రావు భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు హుజురాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా పండుగకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, కార్యక్రమం సజావుగా జరిగేలా అవసరమైన చర్యలపై అధికారులతో సమీక్షించారు. సద్దుల బతుకమ్మ వేడుకల్లో మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో...