సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని మనోజ్ రావు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు హుజురాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు పరిశీలించారు.
ఈ సందర్భంగా పండుగకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, కార్యక్రమం సజావుగా జరిగేలా అవసరమైన చర్యలపై అధికారులతో సమీక్షించారు. సద్దుల బతుకమ్మ వేడుకల్లో మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆమె పేర్కొన్నారు. పండుగను ప్రశాంత వాతావరణంలో, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషన్, సీఐ కరుణాకర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.