భారత రాజ్యాంగంపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే
రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి
మండల నూతన అధ్యక్షుడిగా న్యాయవాది గడ్డం సంజీవ్ కుమార్ ఎన్నిక
భీమ్ ఇండియా టుడే న్యూస్ఎల్కతుర్తి:భారత రాజ్యాంగంపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం నిర్వహించిన మండల సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డ్యాగల సారయ్య మేకల వీరన్న యాదవ్ చెప్పాల ప్రకాష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవ్వ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా బలహీనపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసి మతతత్వ భావజాలాన్ని ప్రోత్సహిస్తూ నియంతృత్వ పాలనకు దారితీసే విధానాలను ప్రజలు అప్రమత్తంగా గమనించాలని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమానత్వం స్వేచ్ఛ న్యాయం సౌభ్రాతృత్వం వంటి గొప్ప విలువలను అందించిందని పేర్కొన్నారు. కులం మతం ప్రాంతం భాష అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడం రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు పౌరుల గౌరవప్రదమైన జీవితానికి భరోసా కల్పిస్తాయని ప్రాథమిక విధులు దేశ సమగ్రతను ఐక్యతను కాపాడాలని గుర్తుచేస్తాయని అన్నారు.
భారత రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదని కోట్లాది ప్రజల హక్కులకు ఆశలకు ఆకాంక్షలకు ప్రతిరూపమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలను చైతన్యపరచడం ప్రతి ప్రజాస్వామ్యవాది బాధ్యత అని స్పష్టం చేశారు.
అనంతరం రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మండల అధ్యక్షుడు న్యాయవాది గడ్డం సంజీవ్ కుమార్ ప్రధాన కార్యదర్శి పర్లపల్లి పృథ్వీరాజ్
మండల కోఆర్డినేటర్ సాతూరి రాజమౌళి
మండల ఉపాధ్యక్షులుగా అంబాల స్వామి జూపాక శీను నిమ్మల మనోహర్ ఆరెపల్లి రాజయ్య పాటి భగవాన్ గౌడ్
కార్యదర్శి బొంకురి కార్తీక్
సభ్యులు పెండ్యాల సుదర్శన్ మేకల రవీందర్ లను ఎన్నుకున్నారు. అనంతరము
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రజాస్వామ్య విలువల ప్రచారం ప్రజల్లో చైతన్యం కల్పించడం వంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాతూరి చంద్రమౌళి చదిరం నాగేశ్వర్ సాతూరి ప్రసాద్ మారపాక అనిల్ కుమార్ కట్కూరి రాజేందర్ జూపాక జడ్సన్ బొంకురి రవీందర్ రేణికుంట్ల సాంబయ్య మంకయ్య అడ్డూరి అనిల్ తదితరులు పాల్గొన్నారు.